బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సాధించినా కూడా తర్వాత వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ పరంగా భారీగా స్లో డౌన్ అయిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi) రెండో వారంలో అడుగు పెట్టగా పోటిలో…
ఇతర సినిమాలు ఉండగా ఏమాత్రం జోరుని అయితే చూపించలేక పోయింది. ఉన్నంతలో 9వ రోజు కొంచం గ్రోత్ ని చూపించినా 10వ రోజు మాత్రం డ్రాప్ అయింది. కానీ తమిళ్ లో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాలలో 31 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 61 లక్షల షేర్ ని అలాగే 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు…
10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kushi(2023) 10 Days Total WW Collections Report
👉Nizam: 13.28Cr
👉Ceeded: 2.30Cr
👉UA: 2.84Cr
👉East: 1.45Cr
👉West: 1.11Cr
👉Guntur: 1.37Cr
👉Krishna: 1.36Cr
👉Nellore: 75L
AP-TG Total:- 24.46CR(40.85CR~ Gross)
👉KA+ROI – 3.36Cr~
👉Other Languages – 3.50Cr~
👉OS – 8.78Cr~
Total World Wide – 40.10CR(75.70CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.40 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.