టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ ఇయర్ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయగా అందులో ఒక సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే మరో సినిమా ఆల్ టైం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది…
రీసెంట్ గా వచ్చిన భోలా శంకర్(Bholaa Shankar) వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలవగా ఈ సినిమా తర్వాత వెంటనే మెగాస్టార్ 2 సినిమాలను కమిట్ అయ్యాడు. అందులో ఒకటి వచ్చే సంక్రాంతికి కూడా ప్లాన్ చేశాడు….
చిరు అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి 156వ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఉంటుందని గట్టి టాక్ రాగా మరోటి బింబిసార డైరెక్టర్ తో కన్ఫాం అయింది. కాగా చిరు పుట్టిన రోజుకి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ కూడా రాగా 156వ సినిమా డైరెక్టర్ ను మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…
కానీ ఇప్పుడు ఈ సినిమాను కంప్లీట్ గా ఆపేసి 157 వ సినిమా అయిన బింబిసార డైరెక్టర్ మూవీనే 156వ సినిమాగా మార్చబోతున్నట్లు సమాచారం… 156వ సినిమా స్టోరీ పాయింట్ మలయాళంలో వచ్చిన బ్రో డాడీ ని పోలి ఉంటుంది అన్న టాక్ చాలా గట్టిగా వినిపించగా…
కథలో చాలా మార్పులు చేశారు అన్న టాక్ కూడా వినిపించింది. కానీ భోలా శంకర్ రిజల్ట్ తో జనాలు రీమేక్ లను రొటీన్ కథలను ఏమాత్రం ఇష్టపడటం లేదని తేటతెల్లం అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టేసి… 157 వ సినిమా అయిన సోషియో ఫాంటసీ మూవీ పైనే…
ఇప్పుడు ఫుల్ ఫోకస్ ని మెగాస్టార్ పెట్టాడని టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ ఉంది… ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమాతో భోలా శంకర్ డిసాస్టర్ ను మరిపించి వాల్తేరు వీరయ్యకి మించిన బ్లాక్ బస్టర్ కొట్టాలని అందరూ ఆశిస్తున్నారు.