బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) భారీ లెవల్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి టాక్ మిక్సుడ్ గా రాగా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కూడా రెండో రోజు నుండి మాత్రం…
అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోతుంది. సినిమా టోటల్ గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 24.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 31.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 6 కోట్ల రేంజ్ నుండి 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 7.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ కూడా అన్ని చోట్లా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అని చెప్పొచ్చు. మొత్తం మీద ఇదే విధంగా సినిమా హోల్డ్ చేస్తే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 31-32 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…
38-39 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ దృశ్యా ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక 4 డేస్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.