బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని పూర్తి చేసుకోగా సినిమా 5 రోజుల్లో ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
సినిమా 6వ రోజు ఫుల్ వర్కింగ్ డే లోకి ఎంటర్ అయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు అలాగే 4వ రోజు మంచి కలెక్షన్స్ ని అందుకున్నా కూడా మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేయగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
6వ రోజు 5వ రోజు తో పోల్చితే ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ లో 70% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఇదే రేంజ్ లో డ్రాప్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా మొత్తం మీద 6వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే సినిమా 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి దాకా వెళ్ళొచ్చు. వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు అటూ ఇటూగా 1.2 కోట్ల రేంజ్ లో..
షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 6 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇక…