ఈ ఇయర్ కోలివుడ్ తరుపున అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) మీద ఆడియన్స్ లో అంచనాలు మరో లెవల్ లో ఉన్నాయి….
లోకేష్ కనగరాజ్ LCU యూనివర్స్ లో ఈ సినిమా కూడా ఒక పార్ట్ అంటూ హైప్ మరో లెవల్ కి వెళ్ళగా ట్రైలర్ చూసిన తర్వాత LCU లో లియో ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు ఉండగా ట్రైలర్ కూడా సినిమా మీద ఉన్న అంచనాలతో కంపేర్ చేసి చెప్పాలి అంటే…
మాత్రం అంతగా అంచనాలను అయితే అందుకోలేదు అనే చెప్పాలి, అయినా కూడా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్ని కావు, 21 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ ని అందుకుని ఆల్ ఇండియా రికార్డ్ కొట్టిన ఈ ట్రైలర్ సౌత్ లో మరే సినిమా ట్రైలర్…
సాధించని రేంజ్ లో 24 గంటల్లో ఒక్క తమిళ్ వర్షన్ నే చూసుకున్నా 31.91 మిలియన్ వ్యూస్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేయగా లైక్స్ పరంగా 24 గంటల్లో 2.64 మిలియన్ లైక్స్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ కొట్టింది… మరే ట్రైలర్ లియో ట్రైలర్ దగ్గరలో కూడా లేదు..
ఇక తెలుగు డబ్ వర్షన్ కూడా 24 గంటల్లో ఏకంగా 5.42 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా 433.5K లైక్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఓవరాల్ గా అన్ని వర్షన్ లు కలిపి 47 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని 3.7 మిలియన్స్ వరకు లైక్స్ ని అందుకున్న ఈ ట్రైలర్ రచ్చతో ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇక…