Home న్యూస్ హీరోయిజం మీద చిరు కామెంట్స్ వైరల్…ఏమన్నాడంటే!

హీరోయిజం మీద చిరు కామెంట్స్ వైరల్…ఏమన్నాడంటే!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(megastar Chiranjeevi) ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ నటించిన భోలా శంకర్(Bholaa Shankar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ డిసాస్టర్ రిజల్ట్ ను…

సొంతం చేసుకున్న తర్వాత మెగాస్టార్ నుండి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ గా ఒక చిన్న ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోల హీరోయిజం అండ్ ఎలివేషన్స్ గురించి అడిగిన ప్రశ్నకి…..

నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎన్నాళ్ళు ఇలా డాన్సులు ఫైట్స్ చేస్తూ వొళ్ళు హూనం చేసుకోవాలి, ఎదో నేను నడుచుకుంటూ వెళితే సాలిడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ లు పూర్తి చేసుకోవచ్చు అని…

కానీ నేను అలా కాదు నేను డాన్సులు చేయాలి, ఫైట్స్ చేయాలి అప్పుడే ఆడియన్స్ కి తృప్తిగా అనిపిస్తుంది, డైరెక్టర్స్ కి నచ్చుతుంది, నిర్మాతలకు డబ్బులు వస్తాయి అంటూ కామెంట్ చేశాడు… ఏ సినిమాను ఉద్దేశ్యించి ఈ కామెంట్స్ చేశారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది…

చిరు ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్ లో భారీ ఫాంటసీ మూవీ చేస్తూ ఉండగా వచ్చే ఏడాది ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఏ రేంజ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here