బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) మూవీ వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా ఓవర్సీస్ లో ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా సినిమాకి అక్కడ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా… ఫస్ట్ రిపోర్ట్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి…
సినిమా స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా స్టువర్ట్ పురంలో ఉండే ఒక మామూలు దొంగ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ దొంగ గా ఎలా మారాడు, దానికి కారణం ఏంటి అనేది సినిమా స్టోరీ గా చెబుతున్నారు. రవితేజ తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేశాడని అంటూ ఉండగా యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ తో దుమ్ము లేపాడని అంటున్నారు…
ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత స్లో డౌన్ అయ్యి తిరిగి ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకున్న సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా ఆసక్తి కరమైన సీన్స్ తో అలాగే కొన్ని చోట్ల కొంచం లెంత్ వలన డ్రాగ్ అయినట్లు అనిపించింది అంటున్నారు…
రియల్ స్టోరీ కి కొన్ని ఫీక్చనల్ సీన్స్ ను యాడ్ చేసి తీసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా లెంత్ పరంగా మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు, అలాగే కోర్ పాయింట్ ఆసక్తిగా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే కొంచం కన్ఫ్యూజింగ్ గా అలాగే కొంచం సాగదీసినట్లు అనిపించింది అన్న కంప్లైంట్ వినిపిస్తున్నా కూడా ఓవరాల్ గా సినిమా పరంగా…
రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, కొన్ని ఆసక్తికరమైన సీన్స్ తో సినిమా సీన్స్ వైజ్ ఉన్నంతలో బాగానే మెప్పించింది అంటున్నారు, ఓవరాల్ గా సినిమాకి ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తి అయిన తర్వాత యావరేజ్ నుండి ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది, ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక…