బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందే ఓపెన్ అయినా అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ సొంతం అవ్వక పోయినా కూడా రవితేజ బ్రాండ్ వాల్యూ వర్క్ అయ్యి…
మరోసారి ఆఫ్ లైన్ లో థియేటర్స్ దగ్గర కౌంటర్ టికెట్ సేల్స్ పరంగా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోయిన సినిమా ఓవరాల్ గా మొదటి రోజు షో షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించింది… ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా రవితేజ నటించిన రీసెంట్ రిలీజ్ అయిన రావణాసుర(Ravanasura) మూవీ కన్నా బెటర్ ట్రెండ్ నే…
చూపెడుతూ ఉండటంతో సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ను ట్రాక్ చేయలేం కాబట్టి సినిమా అంచనాలను మించి పోతే…
మొదటి రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది, ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ డే 1 కలెక్షన్స్ తో అప్ డేట్ అవుతాయి కాబట్టి అక్కడ డీసెంట్ ఓపెనింగ్స్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా హిందీ లో ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ లో డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా…
ఓవరాల్ గా ఇప్పుడు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 6-6.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్కకు మించి వసూళ్ళని సినిమా సొంతం చేసుకోవచ్చు. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.