బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ సెన్సేషనల్ మూవీ లియో(LEO Movie) మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత రెండో రోజులో అడుగు పెట్టగా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా అన్ని చోట్లా…
అద్బుతమైన హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది, తెలుగు లో సినిమా రెండో రోజు కూడా చాలా సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపించగా మొదటి రోజుతో పోల్చితే 55-60% రేంజ్ లో డ్రాప్స్ కనిపించినా కూడా ఓవరాల్ గా మంచి హోల్డ్ నే చూపించి ఇప్పుడు 3.6కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక తమిళ్ లో సినిమా రెండో రోజు కేవలం 30-35% రేంజ్ లోనే డ్రాప్ అవ్వగా అక్కడ ఈ రోజు 24-26 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, కేరళ ఇలా అన్ని చోట్లా సాలిడ్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా…
రెండో రోజు వరల్డ్ వైడ్ గా 60 కోట్ల నుండి 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.