బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ బాక్ టు బాక్ మంచి హిట్స్ గా నిలిచాయి. అలాంటి ఊపు తర్వాత హాట్రిక్ కొట్టడానికి సిద్ధం అయిన సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మూవీ అపజయం అంటే తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తీయగా…
ఈ సారి వీర సింహా రెడ్డిని మించిన రికార్డులు ఖాయం అనుకున్నారు అందరూ… సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వీర సింహా రెడ్డి రేంజ్ లో లేక పోయినా కానీ టాక్ బాగుంటే సినిమా దుమ్ము లేపుతుంది అనుకోగా సినిమాకి అనుకున్నట్లే పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కానీ డబ్ మూవీ పోటి వలన కావచ్చు లేక బాలయ్య రెగ్యులర్ కమర్షియల్ మూవీలా లేకపోవడం కావొచ్చు…
కారణాలు ఏంటో తెలియదు కానీ మంచి రిలీజ్ నే సొంతం చేసుకున్నా కానీ తొలిరోజు కలెక్షన్స్ అంచనాలను అందుకోలేక పోయాయి. బాక్ టు బాక్ హిట్స్ తర్వాత బాలయ్య సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో హైర్స్ ని 3.62 కోట్లు పక్కకు పెడితే వర్త్ షేర్ 10.74 కోట్లు మాత్రమే సొంతం అయింది ఇప్పుడు…
ఈ కలెక్షన్స్ రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన డిసాస్టర్ భోలా శంకర్(Bholaa Shankar) కన్నా తక్కువగా ఉండటం అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది అనే చెప్పాలి… భోలా శంకర్ సినిమాకి మొదటి రోజు…
హైర్స్ 4.50 కోట్లు పక్కకు పెడితే 10.88 కోట్ల దాకా వర్త్ షేర్ సొంతం అయింది…. అసలు మాత్రం బజ్ లేని భోలా శంకర్ మొదటి ఆటకే ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది, అలాంటి సినిమా కలెక్షన్స్ ని మంచి టాక్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి అందుకోలేక పోవడం ట్రేడ్ ని కూడా విస్మయానికి గురి చేసింది…
పోటిలో ఉన్న లియో కొంచం ఓవర్ డామినేషన్ ని నైజాం లో పోటా పోటిని సీడెడ్ లో ఇవ్వడం కలెక్షన్స్ పై కొంచం ఇంపాక్ట్ చూపెట్టి ఉండొచ్చు ఏమో కానీ సీడెడ్ లాంటి ఏరియాలో బాలయ్య సినిమా అంటే జాతర లా వెళతారు, అక్కడ కూడా భగవంత్ కేసరి ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. కానీ ఓవరాల్ గా సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉండటం…
ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ అవుతూ ఉండటంతో కచ్చితంగా లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి వసూళ్ళతో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక దసరా సెలవులు కూడా మొదలు అయ్యాయి కాబట్టి దసరా విన్నర్ గా భగవంత్ కేసరి నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు…