బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జోరు చూపించక పోయినా కూడా ఆఫ్ లైన్ లో కౌంటర్ టికెట్ సేల్స్ లో జోరు చూపించే అవకాశం ఉందని భావించగా…
సినిమా అదే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర రవితేజ మాస్ పవర్ తో పోటిలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. కానీ ఓవరాల్ గా ఇంకొంచం ఎక్కువ ఎక్స్ పెర్టేషన్స్ ని పెట్టుకోగా సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. అయినా కానీ మొత్తం మీద మొదటి రోజున సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 4.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 7.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది, వరల్డ్ వైడ్ గా సినిమా 5.20 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 9.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Tiger Nageswara Rao 1st Day WW Collections Report
👉Nizam: 1.50Cr
👉Ceeded: 65L
👉UA: 48L
👉East: 42L
👉West: 23L
👉Guntur: 60L(22L hires)
👉Krishna: 27L
👉Nellore: 18L
AP-TG Total:- 4.33CR(7.05CR~ Gross)
👉KA+ROI: 0.45Cr
👉OS: 0.42Cr~
Total WW Collections – 5.20CR(9.30CR~ Gross)
ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 37.50 కోట్ల దాకా ఉండగా సినిమా 38.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 33.30 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన పండగ రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.