బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా జనాల లోకి రీచ్ అవ్వాలి అంటే అనేక కారణాలు ఉంటాయి, వాటిలో సినిమా రన్ టైం కూడా ఒకటి, కొన్ని సినిమాల కథ చెప్పడానికి ఎక్కువ టైం పడుతుంది, అది ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఆ రన్ టైం ని కూడా ఆడియన్స్ భరించి ఆ సినిమాను ఆదరిస్తారు, కానీ కొన్ని సినిమాలు పర్వాలేదు బాగుంది కానీ…
రన్ టైం కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది అనిపించే సినిమాలకు ఆ టాక్ మెల్లిగా మిక్సుడ్ గా మారుతుంది, ఇలాంటిదే జరగకుండా జాగ్రత్త పడే వాళ్ళు కొంత మందే ఉంటారు. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా…
విషయంలో మేకర్స్ ఇలాంటిదే చేస్తున్నారు… సినిమా రిలీజ్ కి ముందు రన్ టైం 3 గంటల 2 నిమిషాల దాకా లెంత్ తో ఆడియన్స్ ముందుకు రాగా ఇంత లెంత్ పండగ టైంలో చూసేంత ఓపిక ఎవరికీ ఉంటుంది అన్న అనుమానాలు మొదలు అవ్వగా సినిమా రిలీజ్ టైం కి ఆల్ మోస్ట్ ఓ 8 నిమిషాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేశారు…
అయినా కూడా లెంత్ మరీ ఎక్కువ అయింది అన్న రెస్పాన్స్ తో పాటు సినిమాకి కూడా కొంచం టాక్ మిక్సుడ్ గా ఉండటంతో వెంటనే తేరుకున్న మేకర్స్ రన్ టైం విషయంలో వినిపిస్తున్న కంప్లైంట్ ని వెంటనే పట్టించుకుని రన్ టైంని ఇప్పుడు బాగా తగ్గించేశారు….
ఆల్ మోస్ట్ ఫస్ట్ రన్ టైంతో పోల్చితే ఆల్ మోస్ట్ 25 నిమిషాల రన్ టైం ని తగ్గించి కొంచం లాగ్ అయిన సీన్స్ అన్నీ ఎడిట్ చేసి ఇప్పుడు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో సినిమాను అన్ని చోట్లా ప్రదర్శించబోతున్నారు. కొత్తగా చూసే ఆడియన్స్ నుండి ఇక సినిమాకి బెటర్ టాక్ అండ్ రెస్పాన్స్ సొంతం అయితే సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు ఇప్పుడు.