బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా కి టోటల్ గా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి… వాటిలో 2 సినిమాలు స్ట్రైట్ మూవీస్ కాగా ఒకటి కోలివుడ్ మోస్ట్ హైప్ ఉన్న మూవీ… మొత్తం మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా ఇప్పుడు వీకెండ్ పూర్తి కావోస్తూ ఉండగా దసరా సెలవులు మరో 2 మూడు రోజులు ఉండబోతుండటంతో ఏ సినిమా ఎక్కువ జోరు చూపిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది…
అలాగే ఈ దసరా కి రియల్ ఏ మూవీ అన్నది కూడా ఆసక్తిగా మారగా ఏ సినిమాకి అయినా బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ మెయిన్ కొలమానం కాబట్టి ఆ పరంగా చూసుకుంటే మాత్రం దసరా సినిమాలు అన్నింటిలోకి తెలుగు రాష్ట్రాల్లో లో బిజినెస్ ను అందుకున్న దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(LEO Movie)…. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోబోతుంది..
ఇతర సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యే లోపు లియో మినిమం కలెక్షన్స్ తో రన్ అయినా లాభాలను పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్స్ విషయానికి వస్తే…. ముందుగా మాస్ అండ్ యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటే ఇష్టపడే ఆడియన్స్ అలాగే బయోపిక్స్ టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు రవితేజ(Raviteja) నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) మంచి ఆప్షన్ అని చెప్పాలి.
ఇక యూత్ ఆడియన్స్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి లియో మూవీ ఫస్ట్ ప్రిఫెరెన్స్ గా ఉందని సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా చూపిస్తున్న బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తె అర్ధం అవుతుంది… ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ మాస్ ఎలివేషన్స్ ఉన్న మూవీతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉన్న బాలకృష్ణ(Balakrishna) నటించిన…
భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా మెయిన్ ప్రిఫెరెన్స్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ మిగిలిన సినిమాల్లో బాలయ్య సినిమాకే ఎక్కువగా జై కొడుతూ ఉండగా యూత్ లియోకి, మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ టైగర్ నాగేశ్వరరావుకి వెళ్ళొచ్చు… ఓవరాల్ గా ఏ సినిమా ఎంత జోరు చూపించింది అన్నది ఈ వీక్ పూర్తి అయ్యాక క్లియర్ క్లారిటీతో చెప్పొచ్చు… బట్ ఇనీషియల్ గా మాత్రం హిట్ బిజినెస్ అండ్ టార్గెట్ వైజ్ లియో విన్నర్ గా చెప్పాలి, ఆడియన్స్ కి బెస్ట్ మూవీగా భగవంత్ కేసరి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.