బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ తిరిగి తేరుకుని వరుస ఫ్లాఫ్స్ కి ఈ మధ్య బిగ్ బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము లేపే రేంజ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకుంది, ఈ ఇయర్ పఠాన్(Pathaan), ది కేరళ ఫైల్స్(The Kerala Files), గదర్2(Gadar2) జవాన్(Jawan) లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ పడగా కొన్ని డీసెంట్ హిట్స్ కూడా సొంతం చేసుకుంది…
కానీ ఆడియన్స్ కొన్ని సినిమాలను మినిమం కూడా పట్టించుకోవడం లేదు, అలాంటి సినిమాల్లో ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటించిన కొత్త సినిమా గణపత్(Ganapath Telugu Review) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా దారుణంగా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది…
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలివుడ్ రేంజ్ కంటెంట్ అంటూ మేకర్స్ తెగ ప్రమోట్ చేశారు, సినిమా తీరా రిలీజ్ అయిన తర్వాత చూస్తె డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ దగ్గర నుండి ఇంకా దోచుకుంటున్నారు, అలాగే వాళ్ళకి అండగా నిలవడానికి హీరో ఏం చేశాడు అన్నది స్టోరీ పాయింట్ గా తెరకెక్కిన ఈ సినిమా…
ఒక డిఫెరెంట్ జానర్ లో పరమ రొటీన్ కథతో తెరకెక్కగా ఆడియన్స్ అసలు సినిమాను మినిమం కూడా పట్టించుకోలేదు అనే చెప్పాలి.. దాంతో మొదటి ఆటకే సినిమాకి అట్టర్ ఫ్లాఫ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయింది…. ఇక టైగర్ ష్రాఫ్ యాక్టింగ్ పరమ బోరింగ్ గా ఉండగా తన స్టైల్ లో రొటీన్ యాక్షన్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నా అవి కూడా బోర్ కొట్టేశాయి.
అమితాబ్ బచ్చన్(Amitab Bachchan) కృతి సనన్(Kriti Sanon) ల రోల్స్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు, కథ ఎటు నుండో ఏటో వెళ్లి బాక్సింగ్ రింగ్ కి వచ్చి అక్కడ యాక్షన్ సీన్స్ తో నిండిపోయి ఎండ్ లో ఇక చాలురా బాబు అనిపించిన తర్వాత సినిమాకి పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్ చేయడం చూసి అందరి మైండ్ మరింత బ్లాంక్ అయింది. ఓవరాల్ గా రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది పూర్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి అని చెప్పొచ్చు.