బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO) భారీ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా సినిమా తెలుగు లో ఇక ఇతర సినిమాల పోటి లో తేరుకునే అవకాశం తక్కువగా….
ఉందని అందరూ అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఇప్పుడు విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. అద్బుతమైన లాంగ్ రన్ ని ఇప్పుడు దసరా సెలవుల్లో సొంతం చేసుకుంటున్న లియో మూవీ ఇప్పుడు…
విజయ్ కెరీర్ లో తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా 20 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి రికార్డ్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. దాంతో పాటు ఇప్పుడు మొదటి వారంలో సాధించే కలెక్షన్స్ తో 40 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది ఈ సినిమా…
విజయ్ కెరీర్ లో మోస్ట్ హైప్ తో వచ్చిన లియో మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా మిక్సుడ్ రెస్పాన్స్ తోనే ఏకంగా 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని సంచలనం సృష్టించి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ వైపు ఒక్కో అడుగు వేస్తూ దూసుకు పోతుంది. తెలుగు లో ఈ సినిమా లాంగ్ రన్ లో 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. మరి ఈ మార్క్ ని కూడా దాటి సినిమా ముందుకు వెళుతుందో లేదో అన్నది ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ ని బట్టి చెప్పొచ్చు.