బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సినిమాలు మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమాలు ఇప్పుడు వీకెండ్ లోకి ఎంటర్ అవ్వగా అన్ని సినిమాలు రెండో శనివారం రోజున మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతూ ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు…
అందులో 9వ రోజులో ఎంటర్ అయిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా ఉన్నంతలో 8వ రోజు కన్నా బెటర్ గా హోల్డ్ చేస్తున్నా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండగా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 80 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక లియో మూవీ(LEO Movie) తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 50 లక్షల రేంజ్ నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇక 10వ రోజులో మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో బెటర్ ఆక్యుపెన్సీలతో దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ 1.6 కోట్లు ఆ పైన వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా అన్ని సినిమాలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి అనుకున్న కలెక్షన్స్ కన్నా ఎక్కువ జోరు చూపిస్తాయో లేవో చూడాలి. అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ వచ్చిన తర్వాత అప్ డేట్ చేస్తాం….