మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా అనుకున్న రేంజ్ లో అయితే హోల్డ్ ని చూపించలేక పోతుంది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండటంతో ఇక టార్గెట్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8వ రోజు 62 లక్షల షేర్ ని అందుకుంటే 9వ రోజుకి వచ్చే సరికి గ్రోత్ ని బాగానే చూపెడుతుంది అనుకున్నా కూడా మొత్తం మీద 67 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 81 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా ఇప్పుడు 9 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tiger Nageswara Rao 9 Days WW Collections Report
👉Nizam: 6.88Cr
👉Ceeded: 3.52Cr
👉UA: 2.24Cr
👉East: 1.39Cr
👉West: 90L
👉Guntur: 1.87Cr
👉Krishna: 1.20Cr
👉Nellore: 74L
AP-TG Total:- 18.74CR(32.20CR~ Gross)
👉KA+ROI: 1.98Cr
👉OS: 1.82Cr~
Total WW Collections – 22.54CR (41.65CR~ Gross)
సినిమా మొత్తం మీద 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 15.96 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక.