బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ…
ఇప్పుడు 500 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి కూడా ఇప్పటికీ జోరు చూపిస్తూ ఉండటం విశేషం, కానీ సినిమాకి మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి రాగా ఈ టాక్ గురించి రీసెంట్ గా సినిమా డైరక్టర్ లోకేష్ కనగరాజ్ ను మీడియా వ్యక్తులు ఓపెన్ గానే అడిగారు….
దానికి డైరెక్టర్ జరిగిన తప్పును ఒప్పుకున్నాడు….నేను కూడా థియేటర్స్ లో సినిమా రెస్పాన్స్ ను చూశానని, సెకెండ్ రెస్పాన్స్ అలాగే ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ కి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది అని తప్పు ఒప్పుకున్నాడు… చాలా వరకు డైరెక్టర్స్ ఇలా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చిన దాని పై అడిగితే…
తప్పును ఒప్పుకోకుండా ఆడియన్స్ మీదకి తోస్తారు… లేదా ప్రశ్న అడిగిన వాళ్ళనే డైరెక్ట్ గా మీరే సినిమాలు తీయండి అంటూ చెప్పిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అలాంటి వాళ్ళకి పూర్తి విరుద్దంగా లియో మూవీ కి వచ్చిన మిక్సుడ్ తక ను ఒప్పుకున్న డైరెక్టర్ తన తర్వాత సినిమా లకు మరింతగా శ్రద్ధ పెట్టి…
సినిమాలు చేస్తాను అంటూ చెప్పడం మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పాలి. టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమా ఇప్పటి వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టాక్ పాజిటివ్ గా సొంతం అయ్యి ఉంటే కలెక్షన్స్ రాంపేజ్ ఇంకా ఎక్కువగానే ఉండి ఉండేది అని చెప్పొచ్చు.