బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సినిమాలు రెండో వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా అన్ని సినిమాలు వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ ఉండగా ఉన్నంతలో లియో(LEO Movie) ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఇంకా కష్టపడాల్సి ఉండగా…
టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా చాలా దూరం వెళ్ళాల్సి ఉండగా సినిమా 12వ రోజు 11వ రోజుతో పోల్చితే 20-25% రేంజ్ లో డ్రాప్స్ బుకింగ్స్ లో కనిపిస్తూ ఉండటంతో సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల నుండి 25 లక్షల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
లియో మూవీ కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఈ రోజు 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భగవంత్ కేసరి సినిమా 12వ రోజుతో పోల్చితే 20% రేంజ్ లో బుకింగ్స్ లో డ్రాప్స్ ఉండగా సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 45 లక్షల రేంజ్ నుండి 50 లక్షల లోపు షేర్ ని అందుకునే అవాకాశం ఉందని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 50 లక్షల నుండి 55 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయ్యాయి. ఇక మూడు సినిమాలు ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.