సీక్వెల్స్ అన్ని వేళల ఒరిజినల్ లా మెప్పించడం కష్టమే…అందునా అరిగిపోయిన కాన్సెప్ట్ నే మళ్ళీ తీసుకుని సీక్వెల్ అంటూ రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఆ సినిమాను ఒప్పుకోవాలి అంటే ఆ సినిమా ఇప్పుడు మొదటి పార్ట్ కి మించి మెప్పించాల్సి ఉంటుంది. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు 2005 టైంలో ఎపిక్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన….
చంద్రముఖి(Chandramukhi) సినిమాకి సీక్వెల్ అంటూ ఆల్ మోస్ట్ 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ అంటూ తెరకెక్కించగా రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) సినిమా… ట్రైలర్ తోనే ఎలా ఉండబోతుందో ఆడియన్స్ కి ఒక అంచనా వచ్చినా కూడా…
రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో ఇదేం సినిమారా అంటూ ట్రోల్స్ ని ఫేస్ చేస్తూనే సినిమా 43 కోట్ల టార్గెట్ కి 26.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని నష్టాలను సొంతం చేసుకుని ఫ్లాఫ్ అయింది.
కాగా బాక్స్ ఆఫీస్ రన్ అయిపోయిన తర్వాత సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా నెట్ ఫ్లిక్స్ లో సినిమా ని చూసిన ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రౌండ్ ని గట్టిగా వేసుకుంటున్నారు… అసలు సినిమాలో ఏ అంశం కూడా ఆకట్టుకోలేక పోయిందని, చాలా సీన్స్ నిరాశ పరిచే విధంగా ఉండగా…
ఒరిజినల్ చంద్రముఖితో పోల్చితే చంద్రముఖి2 ఏమాత్రం దరిదాపుల్లోకి కూడా రాలేదు అంటూ ఈ సారి గట్టిగానే వేసుకుంటున్నారు. దాంతో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ దెబ్బ తిన్న సినిమా ఇప్పుడు డిజిటల్ లో కూడా మరోసారి సాలిడ్ గానే ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది.