నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. అఖండ(Akhanda) నుండి నాన్ స్టాప్ గా అద్బుతమైన ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య..
ఈ ఇయర్ సంక్రాంతికి వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) తో దుమ్ము లేపగా ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో దసరాలో సందడి చేస్తున్నాడు. కాగా రీసెంట్ గా 2 వారాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పూర్తి చేసుకోగా…
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 52.94 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 65.74 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాల కలెక్షన్స్ ని కూడా ఒక సారి గమనిస్తే…
అఖండ సినిమా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో 54.93 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 64.73 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, ఇక వీర సింహా రెడ్డి సినిమా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో 64.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 75.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది…
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో 2 వారాల కలెక్షన్స్ పరంగా వీర సింహా రెడ్డి టాప్ లో ఉండగా అఖండ ని మించి భగవంత్ కేసరి మార్జినల్ గ్రోత్ తో సెకెండ్ ప్లేస్ లో వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపింది, కానీ అఖండ సాలిడ్ లాంగ్ రన్ ని అందుకుంది, మరి భగవంత్ కేసరి బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…