బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ హీరోకి అయినా ఒకప్పటిలా 50, 100 సినిమాలు చేయడం ఇప్పుడు చాలా కష్టం, చాలా కొద్ది మంది స్టార్స్ మాత్రమే 50 సినిమాలు చేస్తూ ఉండగా ఇలాంటి టైంలో 25వ సినిమా చాలా మందికి ఇప్పుడు ప్రత్యేకం అయింది అని చెప్పాలి… ఆ 25వ సినిమా తమ కెరీర్ లో నిలిచిపోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది…
కానీ కొందరికి మాత్రమే 25వ సినిమా ప్రత్యేకంగా మారుతుంది. రీసెంట్ గా కోలివుడ్ హీరో కార్తీ(Karthi) నటించిన ప్రతిష్టాత్మక 25వ సినిమా అయిన జపాన్(Japan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది… సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో…
సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హైలెట్ అవుతుంది అనుకున్న కార్తీ డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఒక దశ దాటాక బోర్ కొట్టగా ఓవరాల్ గా సినిమా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది… ఓవరాల్ గా సినిమా చూసిన ఆడియన్స్ కూడా…
ట్రైలర్ చూసి మోసపోయాం అంటూ ఫీల్ అయ్యారు… అసలు డిఫెరెంట్ డిఫెరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుని చాలా వైవిధ్యమైన పాత్రలు చేసిన కార్తీ నుండి ఇలాంటి రొటీన్ రొట్ట సినిమాను అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. అది కూడా కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాకి…
ఇలాంటి కాన్సెప్ట్ మూవీని అయితే ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు, డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీలానే అనిపించినా పరమ రొటీన్ మూవీగా మారిన జపాన్ సినిమా ఓవరాల్ గా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో నిరాశ పరచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.