బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రీసెంట్ టైంలో బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే….అఖండ(Akhanda) వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలతో రచ్చ లేపిన బాలయ్య…
హాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఆ విజయాలతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. అఖండ సినిమా అప్పటి కోవిడ్ పరిస్థితులలో కూడా 50 రోజులకు పైగా ప్రతీ రోజూ షేర్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా…
ఆ తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా మూడు వారాలకు పైగా రెగ్యులర్ గా షేర్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన బాలయ్య ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి సినిమా తో 4 వారాలకు పైగా ప్రతీ రోజూ…
షేర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు. ఇలా రీసెంట్ టైంలో బెస్ట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ సీనియర్స్ లో సెన్సేషనల్ రాంపేజ్ ను చూపెడుతున్న బాలయ్య స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో దుమ్ము లేపుతూ రచ్చ లేపడం విశేషం అని చెప్పాలి. ఇక బాలయ్య అప్ కమింగ్ మూవీస్ తో ఈ ఫామ్ ని ఎలా కొనసాగిస్తాడో చూడాలి.