ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల్లో స్పార్క్(Spark The Life Review) మూవీ ఒకటి…చిన్న సినిమానే అయినా నోటబుల్ హీరోయిన్స్ అండ్ యాక్టర్స్ తో కొత్త హీరో లాంచ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ లు పర్వాలేదు అనిపించగా సాంగ్స్ కి డీసెంట్ రెస్పాన్స్ సొంతం అయింది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే హీరోయిన్ మేహ్రీన్ కి కలలో ఒక వ్యక్తి కనిపిస్తాడు, తనని హీరోయిన్ ఇష్టపడి వెతకడం స్టార్ట్ చేయగా ఆ హీరో తన ఎదురింట్లోనే ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది. కానీ హీరో హీరోయిన్ ని ఇష్టపడటం లేదు అని అంటాడు, తనకి ఒక గతం ఉంటుంది, ఆ గతం ఏంటి…ఆ గతంలో ఉండే మరో హీరోయిన్ రుస్కాన్ ఏమయింది, లాంటి ఇతర విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
కొన్ని సినిమాలు చిన్నవే అయినా యూనిక్ పాయింట్స్ తో వస్తాయి… ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందినదే, డిఫెరెంట్ కాన్సెప్ట్ ను యూనిక్ వె లో చెప్పే ప్రయత్నం చేయగా హీరో తన మొదటి సినిమానే అయినా బాగా నటించి మెప్పించగా కథ స్క్రీన్ ప్లే కూడా తానే రాసుకుని పార్టు పార్టులుగా మెప్పించాడు…
కానీ స్టోరీ పాయింట్ బాగున్నా తెరకెక్కించిన విధానం చాలా నెమ్మదిగా ఉండటం, అక్కడక్కడా కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేయడంతో పడుతూ లేస్తూ సాగే కథ పార్టు పార్టులుగా ఆకట్టుకున్నా ఓవరాల్ గా మాత్రం జస్ట్ ఓకే అనిపించుకునే విధంగా ఉంటుంది, సాంగ్స్ వినడానికి విజువల్స్ గా చాలా బాగుండటం, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా….
గ్రాంగ్ గా తెరకెక్కించడం విశేషం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా చెప్పిన విధానం చాలా కన్ఫ్యూజింగ్ గా డిఫెరెంట్ జానర్స్ ని టచ్ చేయడంతో ఎందులో కూడా పూర్తిగా క్లారిటీ లేకుండా పోయింది…. దాంతో పడుతూ లేస్తూ సాగే సినిమా కాన్సెప్ట్ కోసం, విజువల్స్ కోసం, పాటల కోసం కొంచం ఓపిక పట్టి చూస్తె పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….
Sapthaa saagaaralu daati review please