బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా మొదటి 3 రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా సినిమా 4వ రోజు క్రిస్టమస్ హాలిడేలోకి ఎంటర్ అవ్వగా మరోసారి అన్ని చోట్లా మంచి జోరుని ఓవరాల్ గా…
చూపించబోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరుని చూపిస్తూ ఉండగా డే 3 తో పోల్చితే డే 4 రోజున ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉన్నా కూడా తిరిగి మ్యాట్నీ షోల నుండి మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది సినిమా… మొత్తం మీద సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి…
చూస్తూ ఉంటే 11-12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు నైట్ షోలకు మంచి జోరుని చూపిస్తే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో ఈ రోజు మరోసారి మంచి ట్రెండ్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం సినిమా…
కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది, ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత సినిమా అదే రేంజ్ లో హోల్డ్ అయితే చేయలేక పోతుంది అనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 22-24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఇదే రేంజ్ లో హోల్డ్ చేస్తుందో లేక ఏమైనా గ్రోత్ ని చూపించగలుగుతుందో చూడాలి ఇక…