బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఒక పక్క తెలుగు లో సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా తర్వాత కొంచం స్లో డౌన్ అవ్వగా సినిమా హిందీలో మాత్రం స్టడీ కలెక్షన్స్ తో…
బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున సాధించిన కలెక్షన్స్ తో హిందీలో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసింది. 9వ రోజు 7.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సలార్ మూవీ…
ఓవరాల్ గా 9 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి హిందీలో 106.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది… ఒకసారి సినిమా హిందీ లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#Salaar Hindi Day Wise Collections
👉Day 1: 15.75Cr
👉Day 2: 16CR
👉Day 3: 20.50CR
👉Day 4: 15CR
👉Day 5: 9.50CR
👉Day 6: 9.25CR
👉Day 7: 7.50CR
👉Day 8: 5.75CR
👉Day 9: 7.25CR
Total:- 106.50CR NET
కాగా సినిమా ప్రభాస్ కెరీర్ లో హిందీలో 5వ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది, ఇది వరకు బాహుబలి సిరీస్, సాహో మరియు ఆదిపురుష్ సినిమాలు ఈ మార్క్ ని అందుకోగా ఇప్పుడు సలార్ 5వ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.
సౌత్ లో ఉన్న హీరోలలో ఎవ్వరూ కూడా ప్రభాస్ దరిదాపుల్లో కూడా లేక పోవడం అక్కడ ఏ రేంజ్ లో ప్రభాస్ డామినేషన్ ఉందో అన్నదానికి నిదర్శనం అని చెప్పాలి. మేకర్స్ సరిగ్గా అక్కడ ప్రమోషన్స్ చేసి ఉంటే సినిమా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉండేవి… ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుంటుందో చూడాలి.