బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) న్యూ ఇయర్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకోగా సినిమా ఇక మళ్ళీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే వలన కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నా కూడా మళ్ళీ ఈవినింగ్ షోలకు సినిమా బాగానే హోల్డ్ ని చూపించగా హిందీలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అటూ ఇటూగా 2.2 కోట్ల రేంజ్ నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా ఈ రోజు 4 కోట్ల రేంజ్ నుండి 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
ఇక ఇతర చోట్ల మరో 1 కోటి నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 12వ రోజు వర్కింగ్ డేలో సినిమా ఓవరాల్ గా 6 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా సినిమా 12 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.