బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) న్యూ ఇయర్ హాలిడేస్ లో కుమ్మేసిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిన సినిమా ఇప్పుడు రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా…
13వ రోజు మాదిరిగానే 14వ రోజు వర్కింగ్ డేలో మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజుతో పోల్చితే మరోసారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా అటూ ఇటూగా ఇప్పుడు 45 లక్షల రేంజ్ నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో ఈ రోజు 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా మిగిలిన అన్ని చోట్లా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా ఇప్పుడు 14వ రోజు వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
2కోట్ల దాకా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్రాప్స్ ను అందుకోగా ఈ వీకెండ్ లో సినిమా తిరిగి భారీ లెవల్ లో గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 వారాలకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.