బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా మరో వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వాగా మరోసారి డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నా కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది ఇప్పుడు.
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజు 14వ రోజుతో పోల్చితే 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో మరో సారి పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా…
ఈ రోజు హిందీలో 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా మిగిలిన అన్ని చోట్లా మరో 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. సినిమా మొత్తం మీద 15వ రోజు వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల రేంజ్ నుండి…
1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.