బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అన్నీ కూడా మించిపోయి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా….
రెండో రోజుకి వచ్చేసరికి సినిమా కి పోటిగా సైంధవ్(Saindhav Movie) రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ తగ్గగా హనుమాన్(Hanuman Movie) మాస్ రాంపేజ్ కూడా జోరు చూపిస్తూ ఉండటంతో గుంటూరు కారం థియేటర్స్ అండ్ షోలు కొద్ది వరకు తగ్గాయి. ఇక మొదటి రోజు హైర్స్ ను తీసేస్తే మిగిలిన వర్త్ షేర్ నుండి రెండో రోజు…
ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ కనిపించాయి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా టికెట్ హైక్స్ ఇంపాక్ట్ ని చూపించగా థియేటర్స్ కూడా తగ్గినా కూడా ఈవినింగ్ షోల నుండి సినిమా సిటీలలో మంచి జోరునే చూపించగా సీడెడ్ అలాగే విలేజెస్ లో మాత్రం సినిమాకి డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి.
ఉన్నంతలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 8-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను ఓవరాల్ గా అందుకుంటుందో…
లేక అందుకోదో అన్నది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది… ఓవరాల్ గా సినిమా ఈ మార్క్ ని అందుకుంటే మొదటి రోజు స్ప్రెడ్ అయిన మిక్సుడ్ టాక్ దృశ్యా మంచి హోల్డ్ నే చూపించింది అని చెప్పొచ్చు. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇక…