బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన క్రేజీ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా, ఉన్నంతలో సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో…
పర్వాలేదు అనిపించేలా జోరు చూపించి 9.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, కానీ మిగిలిన చోట్ల సినిమా టాక్ ఇంపాక్ట్ వలన భారీగానే డ్రాప్ అవ్వగా ఓవరాల్ గా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 10.86 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 18.40 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది గుంటూరు కారం సినిమా… ఉన్నంతలో ఇది మంచి హోల్డ్ అనే చెప్పాలి సినిమాకి వచ్చిన టాక్ దృశ్యా… ఇక మొత్తం మీద సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Guntur Kaaram 3 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 24.30Cr
👉Ceeded: 5.50Cr
👉UA: 6.15Cr
👉East: 5.27Cr
👉West: 3.41Cr
👉Guntur: 5.73Cr
👉Krishna: 3.89Cr
👉Nellore: 2.21Cr
AP-TG Total:- 56.46CR (81.00CR~ Gross)
👉KA+ROI:- 4.85Cr
👉OS: 12.70Cr***
Total WW:- 74.01CR(116.70CR~ Gross)
(56%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 58.99 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.