బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాల నడుమ కొంచం హైప్ ఉన్నా అదే టైంలో ఎంతవరకు ఆ హైప్ ను అందుకుంటుందో అన్న అనుమానాల నడుమ రిలీజ్ అయిన హనుమాన్(HanuMan Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని వసూళ్ళతో ఊచకోత కోసింది…
లాంగ్ రన్ లో సంక్రాంతి సినిమాలు అన్నింటినీ డామినేట్ చేస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా అన్ని ఏరియాల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా సినిమా రిలీజ్ టైంలో నైజాంలో థియేటర్స్ సమస్యను భారీగా ఫేస్ చేసిన ఈ సినిమా ను డిస్ట్రిబ్యూషన్ చేసిన మైత్రి మూవీస్ వాళ్ళకి…
ఏమాత్రం అనుకున్న విధంగా స్క్రీన్స్ కూడా దొరకలేదు, కానీ పండగ అయిన తర్వాత బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ గా నిలిచిన హనుమాన్ రెండో వారంలో ఊహకందని రేంజ్ లో జోరు చూపిస్తూ నైజాంలో మైత్రి మూవీస్ వాళ్ళకి అల్టిమేట్ లాభాలను సొంతం అవ్వడమే కాదు ఏకంగా ఇది వరకు 500 కోట్లతో తీసిన సినిమా నష్టాలను కూడా…
ఇక్కడ రికవరీ చేస్తుంది… 2023 బిగ్గీస్ లో ఒకటైన ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(AdiPurush) మూవీని నైజాంలో మైత్రి మూవీస్ వాళ్ళే 50 కోట్ల కు కొని రిలీజ్ చేయగా టోటల్ రన్ లో ఆ సినిమా 39 కోట్లకు పైగా షేర్ ని అందుకుని 11 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది. అదే టైంలో ఇప్పుడు హనుమాన్ మూవీ ని…
నైజాంలో 7.15 కోట్ల రేటుకి కొనగా ఇప్పటి వరకు ఈ సినిమా 28 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోగా ఆల్ మోస్ట్ బిజినెస్ మీద 20 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకోగా 500 కోట్ల సినిమా అయిన ఆదిపురుష్ నష్టాలను కూడా ఇక్కడ రికవరీ చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు సొంతం అయ్యేలా చేయడం విశేషం.