కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్(Captain Miller Movie Telugu Review) తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా తెలుగు లో ఇప్పుడు రిపబ్లిక్ డే కానుకాగా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే తక్కువ జాతికి చెందిన హీరో తన ఊర్లో కుల వివక్షకి గురి అవుతాడు, ఆ ఊరి చివర్లో ఉండే ఒక గుడిని తన పూర్వీకులే కట్టినా కూడా అంటరానితనం వలన తను ఇబ్బందులు ఫేస్ చేస్తున్న టైంలో ఆ గ్రామ దేవుడు అయిన ఘోర హరుడు ఆ ఊరిని కాపాడతాడని ఊరి వాళ్ళు నమ్ముతారు, ఆ దేవుడికి హీరో కి లింక్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళ పై హీరో ఎందుకు పోరాడాడు ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
మంచి పాయింట్ తో వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా పార్టు పార్టులుగా బాగానే మెప్పించింది, ధనుష్ మరోసారి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా కుమ్మేశాడు, ప్రియాంక తన నటనతో పర్వాలేదు అనిపించగా స్పెషల్ రోల్స్ లో శివరాజ్ కుమార్ మరయు సందీప్ కిషన్ లు కూడా మెప్పించారు. సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా…
కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉంటే బాగుండేది అనిపించింది, ఆల్ రెడీ తమిళ్ వర్షన్ తో పోల్చితే తెలుగు వర్షన్ రన్ టైంని తగ్గించారు, సినిమాలో మరింత తగ్గించే కంటెంట్ ఉంది, ఎమోషన్స్ కొన్ని చోట్ల బాగున్నా చాలా చోట్ల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు అనే చెప్పాలి…
కథ బాగానే అనిపించినా తర్వాత సీన్స్ ని ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా ఉండటం, సెకెండ్ ఆఫ్ ని మరీ సాగదీసినట్లు అనిపించడం మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి. కానీ సినిమా పార్టు పార్టులుగా అయితే బాగానే ఆకట్టుకోగా ధనుష్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అలాగే కొన్ని చోట్ల వచ్చిన ఇంపాక్ట్ ఫుల్ సీన్స్ కోసం ఈజీగా ఒకసారి చూసేలా ఉందని చెప్పొచ్చు ఈ సినిమాను…
మొత్తం మీద మరీ ఎక్కువ ఎక్స్ పెర్టేషన్స్ ని పెట్టుకుని వెళితే పర్వాలేదు అనిపించేలా ఉండే కెప్టెన్ మిల్లర్ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి పార్టు పార్టులుగా డీసెంట్ గా మెప్పించే అవకాశం ఉంటుంది… ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….