బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఇండియన్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన యానిమల్(Animal Movie) టాప్ లో ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) టాప్ 2 ప్లేస్ లో నిలిచాయి అని చెప్పాలి…
ఇక బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సినిమాలు రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ప్రభాస్ సలార్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో హిందీ కాకుండా మిగిలిన అన్ని భాషల డిజిటల్ వర్షన్ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దుమ్ము లేపగా తర్వాత యానిమల్ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే…
అన్ని వర్షన్ లు కలిపి రిలీజ్ అయ్యింది. కాగా నెట్ ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా తమ ప్లాట్ ఫామ్ లో ఎక్కువ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాలను అనౌన్స్ చేయగా సలార్ మూవీ కి మొత్తం మీద 9 రోజుల్లో 3.5 మిలియన్ యూనిక్ వ్యూస్ అలాగే 10.3 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ సొంతం అయ్యిందని అనౌన్స్ చేశారు.
హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేసి ఉంటే రెస్పాన్స్ ఇంకా సాలిడ్ గా సొంతం అయ్యి ఉండేది. ఇక యానిమల్ మూవీ రికార్డుల దుమ్ము దులిపెస్తూ 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 6.20 మిలియన్ యూనిక్ వ్యూస్ అలాగే 20.80 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ సొంతం చేసుకుందని సమాచారం.
అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో యానిమల్ మూవీ డిజిటల్ లో కుమ్మేస్తూ ఉండగా సలార్ మూవీ కూడా హిందీ వర్షన్ రిలీజ్ అయ్యి ఉంటే మరింత రచ్చ చేసేది కానీ యానిమల్ మాత్రం తక్కువ రోజుల్లోనే మాస్ ఊచకోత కోసింది. ఇక రెండు సినిమాలు డిజిటల్ లో లాంగ్ రన్ లో ఎలాంటి జోరు చూపిస్తాయో చూడాలి.