బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి గోపీచంద్ కి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది. ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా….
ఇక వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు మేకర్స్….ఆల్ మోస్ట్ 22 కోట్ల మేర బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారని సమాచారం. ఇక ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 24 కోట్ల దాకా ఖర్చు అయ్యిందని ట్రేడ్ వర్గాల లెక్క. ఇక సినిమా కి ఓవరాల్ గా…
జరిగిన థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 11 కోట్ల దాకా ఉండగా…. నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఫుల్ డీటైల్స్ ఏమి రివీల్ చేయలేదు కానీ ఓవరాల్ గా అన్ని కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 15 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….. దాంతో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఓవరాల్ గా…..
26 కోట్ల రేంజ్ లో టోటల్ బిజినెస్ జరిగిందని అంచనా….దాంతో ఓవరాల్ బడ్జెట్ మీద మేకర్స్ కి మైనర్ ప్రాఫిట్స్ అయితే సొంతం అయ్యాయి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న రేంజ్ లో జోరు చూపించి ఉంటే ఇంకా బెటర్ రికవరీ అండ్ ప్రాఫిట్స్ మేకర్స్ కి సొంతం అయ్యి ఉండేవని అంచనా….
ఓవరాల్ గా వరుస ఫ్లాఫ్స్ లో కూడా గోపీచంద్ కి మంచి మార్కెట్ ఇప్పటికీ ఉండగా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా స్టడీగానే సాగుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ సొంతం అవ్వాలి అంటే మాత్రం ఇంకా బెటర్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.