ఇండియాలో ఓవరాల్ గా చాలానే సినీ ఇండస్ట్రీలు ఉండగా వాటిలో మేజర్ గా మాత్రం, బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్, శాండల్ వుడ్ మరియు మాలీవుడ్ లు ముందుగా నిలుస్తాయి అని చెప్పొచ్చు, వీటిలో బాలీవుడ్ సినిమాల వరల్డ్ వైడ్ రేంజ్ మరో లెవల్ లో ఉండగా ఓవర్సీస్ లో కోలివుడ్ మార్కెట్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది…
Industry Hit Movies of all Industries in India
టాలీవుడ్ కి లోకల్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉండగా మళయాళ ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ బాగుంటుంది…. శాండల్ వుడ్ కి కూడా మేజర్ గా లోకల్ మార్కెట్ ఉంటుంది అని చెప్పాలి. ఒకసారి ఈ ఇండస్ట్రీలలో ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న సినిమాలను గమనిస్తే….
టాలీవుడ్:
ప్రస్తుతానికి తెలుగు వర్షన్ పరంగా RRR Movie ఇండస్ట్రీ హిట్ గా ఉండగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం బాహుబలి2(Baahubali2 Movie) ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది…మరి అప్ కమింగ్ టైంలో ఏ సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి….
బాలీవుడ్:
ఇండియాలో బాలీవుడ్ సినిమాల పరంగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్(Jawan Movie) ఇండస్ట్రీ హిట్ గా ఉంటే వరల్డ్ వైడ్ గా అమీర్ ఖాన్(Amir Khan) దంగల్(Dangal Movie) ఇండస్ట్రీ హిట్ గా ఇప్పటికీ కొనసాగుతుంది… చైనాలో ఈ సినిమా వసూళ్ళ జోరు వలన ఇప్పట్లో ఈ సినిమా రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం తక్కువే….
కోలివుడ్:
బిజినెస్ ప్రకారం టార్గెట్ ను అందుకోక పోయినా కూడా కూడా రజినీకాంత్(Rajnikanth) 2.0 మూవీ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా కొనసాగుతుంది. తమిళనాడు వరకు చూసుకుంటే పోన్నియన్ సెల్వన్1 మూవీ స్టేట్ ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోవచ్చు…..
శాండల్ వుడ్:
శాండల్ వుడ్ తరుపున ఆల్ టైం ఎపిక్ రికార్డులు నమోదు చేసిన కేజిఎఫ్ చాప్టర్2(KGF Chapter2) సినిమా కర్ణాటకలో అలాగే వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది… ఇండస్ట్రీ తరుపున బిగ్గెస్ట్ రికార్డులతో మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఈ సినిమాతోనే జరగడం విశేషం.
మాలీవుడ్:
మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) సినిమా ఎపిక్ కలెక్షన్స్ తో మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది…. ఇండస్ట్రీ తరుపున ఫస్ట్ 240 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది… కానీ కేరళ స్టేట్ పరంగా మాత్రం ఇప్పటికీ 2018 మూవీ స్టేట్ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది….
ఇవి మొత్తం మీద ఓవరాల్ గా మేజర్ గా అన్ని ఇండస్ట్రీలలో ఉన్న ఇండస్ట్రీ హిట్ మూవీస్…. అప్ కమింగ్ టైంలో ఈ ఇండస్ట్రీ హిట్స్ లో ఏమయినా మార్పులు లాంటివి ఉంటాయో, కొత్త సినిమాలు ఏవైనా ఈ రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలి…