సోషల్ మీడియా అనేది ఎవ్వరూ కంట్రోల్ చేయలేని ఆయుధం…ఇక్కడ అప్పుడప్పుడు ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. ఓ పెద్ద సినిమా కి మిక్సుడ్ టాక్ వస్తే అది ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుంది…. ఒక సినిమా హిట్ అయితే అందరూ హ్యాప్పీ గా ఫీల్ అవుతారు కానీ అదే సినిమా ఫ్లాఫ్ అయితే ఆ ఫ్లాఫ్ కి బ్లేం ఎవరో ఒకరు మీద వేసుకోవాల్సి వస్తుంది….
రీసెంట్ టైంలో కొన్ని సినిమాలకు మిక్సుడ్ రెస్పాన్స్ వస్తే అది సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో వైరల్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి, అదే టైంలో హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాల రీచ్ సోషల్ మీడియా వలన మరో లెవల్ కి కూడా వెళ్ళింది…
కానీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన క్రేజీ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) మూవీ మీద హీరో అలాగే నిర్మాత భారీ నమ్మకం పెట్టుకుని ప్రమోషన్స్ లో రెట్టించిన జోరు చూపించారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎర్లీ రివ్యూల నుండే…
మిక్సుడ్ రివ్యూలు రాగా సోషల్ మీడియా అంతటా సినిమా పై మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అయింది… దాంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది…కానీ దీని వెనక కొందరు కావాలని పనిగట్టుకుని సినిమా పై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారని హీరో టీం అండ్ నిర్మాత కలిసి ఇప్పుడు…ఎవరెవరు సినిమా పై ట్రోల్స్ వేశారో వాళ్ళందరి మీద సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ లో కేసు నమోదు చేశారు….దాని పై అఫీషియల్ గా టీం మాట్లాడుతూ
ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటెన్షనల్ గా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.
అంటూ స్టేట్ మెంట్ ని రిలీజ్ చేశారు….ఈ ఇయర్ మొదట్లో మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) రిలీజ్ టైంలో కూడా ఇలాంటి ట్రోల్స్ వస్తే కేసు వేశారు, ఇప్పుడు మళ్ళీ ది ఫ్యామిలీ స్టార్ విషయంలో కూడా ఇది జరిగింది… మరి సినిమా మీద ట్రోల్స్ కావాలని వేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు వేశారు…తర్వాత ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు…