బాక్స్ అఫీస్ దగ్గర ఉగాది హాలిడే రోజున అన్ని సినిమాలు మంచి జోరుని చూపెడుతూ ఉండగా ఉన్నంతలో మరోసారి సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది అని చెప్పాలి ఇప్పుడు…
మరో వైపు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) ఉన్నంతలో 4వ రోజు హెవీ డ్రాప్స్ తో పోల్చితే 5వ రోజు ఉగాది హాలిడే రోజున ఉన్నంతలో డీసెంట్ జోరుని చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది…
మొత్తం మీద 5వ రోజు 4వ రోజుతో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డబుల్ గ్రోత్ కనిపిస్తూ ఉండగా టిల్లు స్క్వేర్ మూవీ కూడా 12వ రోజు డబుల్ గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో చూపెడుతూ దూసుకు పోతుంది. దాంతో ఫ్యామిలీ స్టార్ మూవీ 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…
85-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ అఫీస్ దగ్గర 12వ రోజు మొత్తం మీద 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఫ్యామిలీ స్టార్ వరల్డ్ వైడ్ గా 1.1-1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక మొత్తం మీద 2 సినిమాలు అఫీషియల్ కలెక్షన్స్ పరంగా ఈ అంచనాలను మించుతాయో లేదో చూడాలి ఇక…