రెండేళ్ళ క్రితం గుర్తుందా శీతాకాలం సినిమా చేసిన సత్యదేవ్(Satyadev) ఆల్ మోస్ట్ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కృష్ణమ్మ(Krishnamma Movie) సినిమాతో కంబ్యాక్ కి సిద్ధం అయ్యాడు…. సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మాస్ రివెంజ్ మూవీలా అనిపించిన కృష్ణమ్మ(Krishnamma Movie Review Rating) ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే…ఊర్లో ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉండే హీరో అనుకోకుండా ఒక మర్డర్ కేసులో తన ఫ్రెండ్స్ తో ఇరుక్కుంటాడు. పోలీసులు ఎలాగైనా ఆ కేసులో హీరో అండ్ ఫ్రెండ్స్ ను ఇరికించాలని చూస్తారు…ఆ తర్వాత కథ ఏమయింది… హీరో ఆ కేసులో తనని ఇరికించిన వాళ్ళ మీద ఎలా రివేంజ్ తీసుకున్నాడు అన్నది మిగిలిన కథ….
ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో సత్యదేవ్ తన లో మాస్ టచ్ ని చూపించగా మొదట్లో నవ్వించి తర్వాత పోలిసుల చేతుల చిత్రహింసలు అనుభవించిన సీన్స్ లో తన నటన చాలా బాగుంది…తన ఫ్రెండ్స్ కూడా బాగా నటించగా పోలిస్ రోల్ లో రఘు కుంచె బాగా నటించాడు….హీరోయిన్ రోల్ పర్వాలేదు అనిపించేలా ఉండగా…
సంగీతం ఓకే అనిపించగా స్నేహితుల మీద తీసిన సాంగ్ బాగొచ్చింది.. యాక్షన్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో పోలిస్ స్టేషన్ సీన్స్ అండ్ టార్చర్ సీన్స్ కొంచం ఇబ్బంది పెట్టాయి. సెకెండ్ ఆఫ్ లో యాక్షన్స్ సీన్స్ బాగా వచ్చాయి….
ఇక క్లైమాక్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిన ఫీలింగ్ కలిగింది… మొత్తం మీద డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా నార్మల్ గా ఉండగా….పార్టు పార్టులుగా బాగానే అనిపించిన కృష్ణమ్మ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మాస్ అండ్ రివేంజ్ డ్రామా మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి కొంచం అక్కడక్కడా బోర్ కొట్టినా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి బాగుంది అనిపించేలా ముగుస్తుంది… రెగ్యులర్ మూవీ లవర్స్ కి మాత్రం కొన్ని చోట్ల ఓకే అనిపించినా కొన్ని చోట్ల చాలా సాదాసీదాగా అనిపించింది…
మొత్తం మీద సత్యదేవ్ నుండి పర్వాలేదు అనిపించే కంబ్యాక్ మూవీగా అనిపించింది కృష్ణమ్మ మూవీ, పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి ఓవరాల్ గా సినిమా అయ్యే సరికి పర్వాలేదు ఒకసారి ఈజీగా చోసేయోచ్చు అనిపించేలా ముగుస్తుంది….. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….