బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో లాస్ట్ డిసెంబర్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ పరంగా చూసుకుంటే కలెక్షన్స్ విషయంలో హైయెస్ట్ వసూళ్ళని అందుకున్న సినిమాలు ప్రభాస్(Prabhas) సలార్(Salaar) తేజ సజ్జ(Teja Sajja) హనుమాన్(HanuMan) మరియు మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాలు…. నెల గ్యాప్ లో టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన బిగ్ మూవీస్ ఈ సినిమాలు…
వీటిలో హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ తో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మూడు సినిమాల్లో తక్కువ టికెట్ రేట్స్ తో భారీ ఫుట్ ఫాల్స్ ను సైతం సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు….ఇక లాభాల పరంగా హనుమాన్ లాభాలు మరో లెవల్ లో ఉండగా మిగిలిన 2 సినిమాలను టెలివిజన్ లో సైతం డామినేట్ చేసింది ఈ సినిమా…
టెలివిజన్ లో ముందుగా టెలికాస్ట్ అయిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కి 9.23 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ కి ఈ రేటింగ్ గుడ్ అనే చెప్పొచ్చు, ఇక మాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సలార్ మూవీ ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 6.5 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే అందుకుని టెలివిజన్ లో పూర్తిగా అంచనాలను తప్పింది..
అదే టైంలో పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పోల్చితే బడ్జెట్ పరంగా స్టార్ కాస్ట్ పరంగా చిన్న సినిమా అయిన హనుమాన్ మాత్రం టెలివిజన్ లో 10.26 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మిగిలిన సినిమాలను ఓడించింది….సినిమా సాధించిన బాక్స్ ఆఫీస్ విజయానికి ఇది కొనసాగింపే అయినా కూడా…
చాలా మంది ఆల్ రెడీ థియేటర్స్ లో చూసిన సినిమాలకు టెలివిజన్ లో రేటింగ్ లు తక్కువగా వస్తున్నాయి. అదే టైంలో టాప్ స్టార్ మూవీస్ కి ఎప్పటికీ మినిమమ్ రేంజ్ రేటింగ్ లు ఉంటాయి. కానీ బడ్జెట్ పరంగా స్టార్ పరంగా చాలా పెద్ద సినిమాలను సైతం హనుమాన్ ఇప్పుడు డామినేట్ చేయడం విశేషం….ఇక పార్ట్ 2 ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.