Home గాసిప్స్ రామ్ డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్…ఇన్ని కోట్లు ఏంటి సామి!!

రామ్ డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్…ఇన్ని కోట్లు ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్(ISmart Shankar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సెన్సేషనల్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double ISMART Movie) సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే రిలీజ్ అయ్యి ఉండాల్సింది కానీ సినిమా పోస్ట్ పోన్ అయ్యి త్వరలోనే…

ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా రామ్ బర్త్ డే టైంలో సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. మరోసారి మాస్ కంటెంట్ తో హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా మొత్తం ఉండబోతుంది అని టీసర్ చూస్తె క్లారిటీ వచ్చేయగా….

మొదటి పార్ట్ రేంజ్ లో ఉన్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ రికార్డులను సైతం అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా కన్నా ముందు పూరీ జగన్నాథ్ మరియు రామ్ లు ఇద్దరికీ కూడా ఫ్లాఫ్స్ పడగా ఆ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ పై పడుతుంది అనుకున్నా కూడా…..

ఈ సారి భారీ బడ్జెట్ తో సీక్వెల్ రూపొందుతుంది అని అంటున్నారు…ఆల్ మోస్ట్ సినిమా కోసం ఇప్పుడు 65-70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు, స్టార్ కాస్ట్ కి రెమ్యునరేషన్ ల కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అని వార్తలు వస్తూ ఉండగా మిగిలిన బడ్జెట్ లో సినిమా ప్రొడక్షన్ మొత్తం జరిగింది అని అంటున్నారు…

ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకేక్కినా కూడా చాలా వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకి అమ్మారని అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి జోరు చూపించే అవకాశం ఉండగా అంచనాలను కనుక సినిమా అందుకుంటే కచ్చితంగా మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here