టాలీవుడ్ లో చాలా వరకు పెద్ద చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు మేకర్స్ కి బయ్యర్స్ నుండి ఆ సినిమాల క్రేజ్ ను బట్టి ఆఫర్స్ సాలిడ్ గా వస్తూ ఉంటాయి…కానీ అప్పుడప్పుడు సినిమాల బడ్జెట్ అండ్ క్రేజ్ ను బట్టి నిర్మాతలు ఎక్కువ రేట్స్ ను ఆశిస్తారు….అదే టైంలో బయర్స్ కి ఆ సినిమాల మీద నమ్మకం ఎక్కువగా ఉంటే…
నిర్మాతలు చెప్పిన రేట్స్ కి బయర్స్ కి ఇష్టం ఉంటే ఆ రేట్స్ ఇచ్చి సినిమాలను కొంటారు…కానీ రీసెంట్ టైంలో పెద్ద సినిమాల విషయంలో కూడా రేట్స్ పెరిగి పోతూ ఉండటంతో బయర్స్ కూడా ఆ రేట్స్ ను ఇవ్వలేక పోతున్నారు…ఇప్పుడు ఇలాంటి ఇంపాక్ట్ అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్ అయిన…
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా ల బిజినెస్ విషయంలో కొంచం ఇంపాక్ట్ పడింది…చాలా వరకు పెద్ద సినిమాలకు బయర్స్ దగ్గర నుండి….నిర్మాతలు…
నాన్ రిఫండబుల్ అమౌంట్ రూల్ కింద భారీ మొత్తాలను సొంతం చేసుకుంటారు…సినిమా అంచనాలను అందుకుంటే అందరూ హ్యాప్పీ, కానీ అంచనాలను అందుకోలేక పొతే మట్టుకు బయర్స్ కి నష్టాలు తప్పవు…రీసెంట్ టైం ఇవి ఎక్కువగా అవుతూ ఉండటం….ఇప్పుడు కల్కి-పుష్ప2 ల మీద అంచనాలు ఎంత ఉన్నా కూడా…
మేకర్స్ నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద భారీ రేట్స్ అడుగుతున్నా కూడా బయర్స్ మాత్రం కావాలంటే ఎంత అడ్వాన్స్ బేస్ మీద అయినా రేట్స్ ఇస్తాం కానీ రిఫండబుల్ అమౌంట్ కింద మాత్రం కొనమంటే కొనము అంటున్నారట…దాంతో ఇప్పుడు బయర్స్ అడ్వాన్స్ బేస్ మీద కొనడానికి సిద్ధం అవ్వడంతో ఇప్పుడు అలాగే ఈ సినిమాల బిజినెస్ జరగబోతుంది అని సమాచారం.