Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2 నెలల డ్రై సీజన్ తర్వాత ఎట్టకేలకు కొన్ని డీసెంట్ మూవీస్ ఆడియన్స్ ముందుకు మే లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవ్వగా వాటిలో కొంచం బజ్ ఎక్కువగా సొంతం చేసుకున్న సినిమాగా రిలీజ్ అయిన విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా వరల్డ్ వైడ్ గా…

Gangs Of Godavari Movie Review
గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది…ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా వచ్చింది అన్నది ఆసక్తిగా మారగా కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ హీరో పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి యువ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఫేస్ చేసిన పరిస్తితులు ఊరి వాళ్ళతో గొడవల వలన ఎలాంటి ఇంపాక్ట్ తన లైఫ్ మీద పడింది…

ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత హీరో లైఫ్ ఎలా సాగుతుంది, తన లవ్ అండ్ పొలిటికల్ లైఫ్ ను కొంచం పడుతూ లేస్తూ సాగే స్క్రీన్ ప్లే తో చాలా వరకు ఎంగేజింగ్ గానే చూపించగా బ్యాగ్రౌండ్ స్కోర్, 2 సాంగ్స్ అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ లు…

పర్వాలేదు అనిపించేలా మెప్పించాయి అని అంటూ ఉండగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం డ్రాగ్ అయినట్లు, కొంచం ఎటు నుండి ఎటో వెళ్ళినట్లు, యాక్షన్ డోస్ ఎక్కువ అయినట్లు అనిపించిందని, అయినా కూడా విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల కథ వీక్ గా అనిపించినా పర్వాలేదు అనిపించేలా చేసిందని అంటున్నారు…

మొత్తం మీద ఫస్టాఫ్ కథ పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ కథ యావరేజ్ లెవల్ లో అనిపించింది అంటున్నారు….మొత్తం మీద ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైంకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లెవల్ లో టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది అని చెప్పాలి.

ఇక రెగ్యులర్ షోలకి మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి కూడా ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్స్ వినిపిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here