గాడ్జిల్లా సినిమా అంటే రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో హీరోలాగా చూపించారు…కానీ అసలు సిసలు గాడ్జిల్లా మూవీ అంటే ఇలా ఉంటుంది అంటూ లాస్ట్ ఇయర్ జపాన్ లో చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన గాడ్జిల్లా మైనస్ వన్(Godzilla Minus One Movie Telugu Review) సినిమా నిరూపించింది… కేవలం 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా…
టోటల్ రన్ లో 80 మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 660 కోట్ల గ్రాస్ ను అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా రన్ అయిపోయిన ఆల్ మోస్ట్ 6 నెలల తర్వాత ఇప్పుడు ఇండియన్ OTT లోకి వచ్చేసింది ఈ సినిమా. నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కథ గురించి తెలుసుకుందాం పదండీ…
ఎయిర్ పైలెట్ అయిన హీరో 1945 టైంలో వరల్డ్ వార్ 2 లాస్ట్ టైం లో ఉన్న సమయంలో ఒక ఐలాండ్ లో ఉండగా అక్కడ అనుకోకుండా ఒక గాడ్జిల్లా వచ్చి అల్లకల్లోలం చేస్తుంది…హీరోకి ఆ గాడ్జిల్లాని చంపే ఛాన్స్ ఉన్నా భయపడి చంపలేదు…దాంతో అక్కడ ఉన్నవాళ్ళందరినీ గాడ్జిల్లా చంపేస్తుంది…ఆ ఇంసిడెంట్ తర్వాత హీరో లైఫ్ మారిపోతుంది…
కానీ మళ్ళీ తన లైఫ్ లోకి గాడ్జిల్లా ఎంట్రీ ఇస్తుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…లిమిటెడ్ బడ్జెట్ తో తెరకేక్కడంతో మరీ గ్రాఫిక్స్ హంగులు ఎక్కువగా లేవు కానీ ఉన్నంత వరకు గ్రాఫిక్స్ క్వాలిటీ గాడ్జిల్లా లుక్స్ మరో లెవల్ లో ఉంటుంది..ముఖ్యంగా గాడ్జిల్లా సిటీ పై చేసే దాడి తన తోక నుండి పవర్ ను గ్రహిస్తూ లైట్ అప్ అవ్వడం….
ఆ తర్వాత తన గాండ్రింపు మరో లెవల్ లో ఉంటాయి…గాడ్జిల్లా అంటే హీరోగా చూసిన మనకు ఇలా విలన్ గా చూపించి ఎమోషనల్ గా టచ్ అయ్యే సీన్స్ తో సినిమాను డైరెక్టర్ చాలా బాగా తీశాడు. సినిమా కథనం చాలావరకు స్లోగా సాగినా కూడా తర్వాత సీన్ ఏమవుతుందో క్లైమాక్స్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి చివరి వరకు ఎక్సైట్ మెంట్ ను ఏమాత్రం చెడగొట్టదు అని చెప్పాలి…
గాడ్జిల్లా మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు…ఫ్రీ టైం లో కచ్చితంగా OTT లో చూడదగ్గ మూవీస్ లో ఈ సినిమా ఈ వీకెండ్ లో ముందు నిలిచే సినిమా అని చెప్పొచ్చు.