మే లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie), గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మరియు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమాలు ఉన్నంతలో ఆడియన్స్ ను కొంత వరకు తిరిగి థియేటర్స్ కి రప్పించగలిగాయి అని చెప్పాలి… కానీ ఏవి కూడా యునానిమస్ రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకోలేదు కానీ…
ఉన్నంతలో భజే వాయు వేగం మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మొదటి రోజు కన్నా రెండో రోజు సాలిడ్ గా జోరు చూపించి ఇప్పుడు మూడో రోజు కూడా మంచి జోరుని చూపిస్తూ దుమ్ము లేపుతుంది ఇప్పుడు…ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మూడో రోజులో మరోసారి మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా…
నైజాంలో కొంచం డ్రాప్ అవ్వగా ఓవరాల్ గా మూడో రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 1.5 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక గం గం గణేశ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మొదటి రోజుకి కొంచం సిమిలర్ గానే ట్రెండ్ అవుతూ ఉన్నా కొన్ని చోట్ల డ్రాప్ ఉండగా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని మూడో రోజు అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భజే వాయు వేగం సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో మూడో రోజు…
ట్రెండ్ అవుతూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగానే ఉండే అవకాశం ఉండగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 1 కోటికి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక మూడు సినిమాల అఫీషియల్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.