Home న్యూస్ పుష్ప2 తో పోటి….ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో!!

పుష్ప2 తో పోటి….ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో!!

0

ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా…ఎపిక్ అంచనాల నడుమ ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది…

భారీ వీకెండ్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా తో పోటికి కూడా ఇతర ఇండస్ట్రీల నుండి సినిమాలు వెనకడు వేస్తూ ఉండగా తెలుగు తర్వాత ఈ సినిమా సీక్వెల్ పైన భారీ అంచనాలు ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సింగం3 లాంటి బిగ్ మూవీ రిలీజ్ ను ముందు ప్లాన్ చేసినా తర్వాత రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంది.

ఇక ఇప్పుడు ఆ సినిమా ప్లేస్ లో మరో సినిమా పోటికి సిద్ధం అవుతుంది. ఆగస్టు 15 వీకెండ్ లో ఇది వరకు సత్యమేవ జయతే2 సినిమాతో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్న బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం(John Abraham) నటిస్తున్న లేటెస్ట్ మూవీ వేద మూవీని ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తూ ఉండగా రీసెంట్ గా రిలీజ్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…

దాంతో ఇప్పుడు పుష్ప2 తో పోటికి ఈ సినిమా బాలీవుడ్ లో సిద్ధం అవ్వగా స్క్రీన్స్ పరంగా కొద్ది వరకు ఆ సినిమాకి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది…దాంతో కలెక్షన్స్ పరంగా కొంచం ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నా కూడా ప్రస్తుతానికి జాన్ అబ్రహం సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వడం లేదు…

ఇలాంటి టైంలో పాన్ ఇండియా మోస్ట్ క్రేజీ మూవీ అయిన పుష్ప2 తో పోటి అంటే లారీ టైర్ కింద నిమ్మకాయ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ సినిమా ఓ రేంజ్ లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటే తప్పితే పుష్ప2 కి పోటి ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here