అప్పట్లో గౌతమ్ ఎస్ ఎస్ సి, చందమామ లాంటి మంచి విజయాలను సొంతం చేసుకున్నా కూడా తర్వాత హీరోగా చేసిన సినిమాలతో పెద్దగా మెప్పించ లేక పోయిన నవదీప్(Navadeep) ఇతర సినిమాల్లో ముఖ్య రోల్స్ ని చేస్తూ ఉండగా కొంత టైం తర్వాత నవదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మౌళి(Love Mouli Movie Review Rating) సినిమా రీసెంట్ గా వచ్చాడు…
ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా ఎంతవరకు సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే చిన్న ఏజ్ లోనే ఒంటరి వాడు అయిన హీరో తన తాతయ్యతో కొంత కాలం గడిపి ఆ తర్వాత మేఘాలయలో అఘోరా దగ్గర వెళతాడు…ఆ క్రమంలో అనుకోకుండా…
ఒక మ్యాజిక్ పెయిటింగ్ బ్రష్ దొరుకుతుంది…ఆ బ్రష్ తో వేసిన పెయిటింగ్ లో బొమ్మ నిజంగానే తన లైఫ్ లోకి వస్తుంది. ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పాయింట్ యూనిక్ గా అనిపించినా కూడా టేకింగ్ అండ్ నరేషన్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. సినిమాను మెయిన్ గా యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ తో నింపేసిన డైరెక్టర్…
గ్లామర్ సీన్స్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టినా మిగిలిన కథని మాత్రం చాలా నెమ్మదిగా నడపడంతో కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా కూడా చాలా వరకు కథ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది…యూత్ ని టార్గెట్ చేసి తీసిన సీన్స్ కూడా ఒక దశ దాటాక ఓవర్ గా అనిపించగా ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకునే విషయంలో నవదీప్ ని మెచ్చుకోవాల్సిందే కానీ…
ఇది చాలా తక్కువ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా సెకెండ్ ఆఫ్ లో సహనానికి పరీక్ష పెట్టె సీన్స్ చాలానే వచ్చాయి అని చెప్పాలి. దాంతో ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ అండ్ బోల్డ్ సబ్జెక్ట్ లు నచ్చే ఆడియన్స్ కొంచం…
ఓపిక చేసుకుని చూస్తె ఓవరాల్ గా సినిమా యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు….మిగిలిన ఆడియన్స్ మాత్రం సినిమా చూడాలి అంటే చాలా ఓపికతో చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్….