Home న్యూస్ హరోం హర మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

హరోం హర మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie REVIEW RATING) సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున వచ్చేసింది…. ట్రైలర్ నుండే ప్రామిసింగ్ ఫీలింగ్స్ కలిగించిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…కాలేజ్ లో లాబ్ అసిస్టంట్ పని చేసే హీరోకి లైఫ్ లో డబ్బు సంపాదించాలి అన్న కోరిక బలంగా ఉంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా గన్స్ ను తయారు చేయడం సైడ్ బిజినెస్ గా స్టార్ట్ చేస్తాడు…క్రమంగా ఆ బిజినెస్ లో భారీగా సంపాదించే హీరోకి శత్రువులు కూడా ఎక్కువ అవుతారు…ఈ క్రమంలో హీరో ఏం చేశాడు అన్నది ఓవరాల్ గా మిగిలిన కథ….

కథ పాయింట్ రొటీన్ గానే అనిపించినా కూడా హీరో ఒక టాప్ స్టార్ ను డీల్ చేసినట్లు సుదీర్ బాబుని డీల్ చేశాడు…ఎక్స్ లెంట్ ఎలివేషన్ లు, స్లో మోషన్ షాట్స్…మైండ్ బ్లోయింగ్ యాక్షన్ బ్లాక్స్ తో KGF-పుష్ప లాంటి సినిమాలను స్పూర్తిగా తీసుకుని హీరోని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు… కానీ స్టోరీ లో కొత్తదనం లేక పోవడంతో తర్వాత సీన్స్ చాలా వరకు ఆడియన్స్ గెస్ చేసేలా ఉంటాయి.

అయినా కూడా సుదీర్ బాబు పెర్ఫార్మెన్స్, హీరోయిజం ఎలివేట్ సీన్స్ కానీ డైలాగ్ డిలివరీ కానీ అదరగొట్టేశాడు అనే చెప్పాలి….తన కెరీర్ కి నిజంగానే ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వడం ఖాయం… ఇక సునీల్ కూడా తన రోల్ వరకు బాగా నటించి మెప్పించగా హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించింది…సంగీతం పర్వాలేదు అనిపించగా…

బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్ కి ఓ రేంజ్ లో హైలెట్ అయ్యింది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం టైట్ చేసి రన్ టైం ని మరింత తగ్గించి ఉంటే బాగుండేది… ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో కొంచం కథ ఎక్కువగా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. అలాగే క్లైమాక్స్ కూడా ఆడియన్స్ గెస్ చేసినట్లే సాగుతుంది…

సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించాయి…ఇక డైరెక్టర్ ఒక టాప్ స్టార్స్ కి పడే రేంజ్ లో సీన్స్ ను సుదీర్ బాబుకి ఇవ్వడం, సుదీర్ బాబు కెరీర్ కి మంచి గ్రోత్ సొంతం అయ్యేలా సినిమాను డీల్ చేయడం విశేషం… కానీ కథ రొటీన్ గా ఉండటం, కొంచం డ్రాగ్ అవ్వడం లాంటివి లేకుండా ఉండి ఉంటే సినిమా రేంజ్ ఇంకా మరో లెవల్ లో ఉండేది.

అయినా కూడా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి సినిమా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించడం ఖాయం, ఇక మాస్ ఆడియన్స్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది…రెగ్యులర్ మూవీ లవర్స్ కి కొంచం స్లో అయినా పర్వాలేదు ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది సినిమా. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here