Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి OTT రెస్పాన్స్….ఇక్కడ కుమ్మింది…అక్కడ దెబ్బ పడింది!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి OTT రెస్పాన్స్….ఇక్కడ కుమ్మింది…అక్కడ దెబ్బ పడింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మే లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించిన విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) రెండో వీకెండ్ వరకు కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత….

బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా రాగా ఇక క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సడెన్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. సినిమా  రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అక్కడ నుండి సినిమాకి మంచి రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవుతుంది అని చెప్పాలి ఇప్పుడు….

సినిమా కథ కొంచం రొటీన్ గానే ఉన్నా కూడా సినిమాలో మాస్ ఎలిమెంట్స్, ఫైట్ సీన్స్, హీరో క్యారెక్టరైజేషన్ బాగా డీల్ చేయడంతో ఫస్టాఫ్ కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా కూడా ఓవరాల్ గా సినిమా ఈజీగా ఒకసారి చూసేలా ఉందని టాక్ డిజిటల్ రిలీజ్ తర్వాత సొంతం అవ్వగా….

వ్యూస్ మాత్రం సాలిడ్ గానే సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా OTT లో మాత్రం కుమ్మేస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమాకి దెబ్బ పడింది అనే చెప్పాలి. సినిమాకి రెండో వీకెండ్ తర్వాత కూడా హోల్డ్ బాగానే ఉండే అవకాశం ఉండేది కానీ డిజిటల్ రిలీజ్ వలన సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు నుండే కంప్లీట్ గా డౌన్ అయిపొయింది…దాంతో ఓవరాల్ గా బిజినెస్ ను రికవరీ చేసినా కూడా డీసెంట్ హిట్ అవ్వాల్సిన చోట జస్ట్ బిజినెస్ ను రికవరీ చేసి సెమి హిట్ టు హిట్ కి మధ్యలో పరుగును కంప్లీట్ చేసుకోబోతుంది సినిమా…రెండు వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ ను అనౌన్స్ చేసినా సినిమా క్లీన్ హిట్ అయ్యి ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here