Home న్యూస్ 10 సినిమాల్లో 8 ఫ్లాఫ్స్….కానీ ఈ సినిమాతో కంబ్యాక్ పక్కా!!

10 సినిమాల్లో 8 ఫ్లాఫ్స్….కానీ ఈ సినిమాతో కంబ్యాక్ పక్కా!!

0

బాలీవుడ్ లో హిట్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్న హీరోలలో ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) ముందు నిలుస్తాడు. ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నా కూడా తర్వాత టైంలో వరుస పెట్టి ఫ్లాఫ్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ నటించిన లాస్ట్ 10 సినిమాల్లో 2 సినిమాలు మాత్రమే హిట్ గా నిలిచాయి, మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి…

అక్షయ్ కుమార్ బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2, మిషన్ రాణిగంజ్ మరియు బడే మియా చోటే మియా సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ మరియు OMG2 లు మాత్రమే ఆకట్టుకున్నాయి, ఇలాంటి టైంలో కెరీర్ లో ఎట్టి పరిస్థితులలో కూడా హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న…

అక్షయ్ కుమార్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(sarfira Movie) ఆడియన్స్ ముందుకు జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…ఈ సినిమాతో అక్షయ్ కుమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ సినిమాతో కంబ్యాక్ ఖాయమని చెప్పడానికి కారణం….

కోవిడ్ టైంలో OTT లో రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ గా నిలిచిన సూర్య(Suriya) మరియు సుధ కొంగర కాంబోలో వచ్చిన ఆకాశం నీ హద్దుగా(Aaksham Nee Haddugaa Movie) మూవీ హిందీ రీమేక్ గా రూపొందుతుంది….ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సుధ కొంగరనే రీమేక్ ను రూపొందిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు..

రీసెంట్ టైములో హిందీలో రీమేక్ అయిన మూవీస్ ని చాలా వరకు చెడగొట్టారు, కానీ ఈ సినిమా విషయంలో ఒరిజినల్ డైరెక్టరే ఇక్కడ రీమేక్ చేస్తూ ఉండటం, ట్రైలర్ చూస్తూ ఉంటే ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టలేదు అనిపించేలా ఉండటంతో ఈ సారి అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అనిపిస్తుంది ఇప్పుడు…మరి ఇదే నిజం అవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here